గురుకులంలో జోనల్‌ అధికారి విచారణ | - | Sakshi
Sakshi News home page

గురుకులంలో జోనల్‌ అధికారి విచారణ

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

దామెర : హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో 14 మంది విద్యార్థుల సస్పెన్షన్‌ ఘటనపై జోనల్‌ అధికారి అపర్ణ సోమవారం విచారణ చేపట్టారు. ఉదయం 10 గంటలకు చేరుకున్న అధికారి సుమారు 4 గంటలకు పైగా ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. కళాశాలలోకి మద్యం, సిగరెట్లు, సెల్‌ఫోన్‌ ఎలా వచ్చాయనే విషయంపై విచారించారు. కళాశాల ప్రాంగణమంతా కలియదిగారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ప్రవర్తన కారణంగానే సస్పెన్షన్‌ క్రమశిక్షణ కమిటీ విధించిందన్నారు. విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. విద్యార్థులపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. సస్పెన్షన్‌కు గురైన పలువురు విద్యార్థులు కళాశాలకు తిరిగి హాజరయ్యారని పేర్కొన్నారు. మరోమారు ఇలాంటి చర్యలు పురావృతం కావొద్దని ఆదేశించారు. ప్రిన్సిపాల్‌ ఆనందరావు, అధ్యాపకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement