ఉన్నత వైద్యాధికారులకు తెలిసినా.. | - | Sakshi
Sakshi News home page

ఉన్నత వైద్యాధికారులకు తెలిసినా..

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

ఉన్నత వైద్యాధికారులకు తెలిసినా..

మెడికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు వైద్యులు రావడం లేదని తెలిసినా ఉన్నత వైద్యాధికారులు కూడా ఏమి చేయలేకపోతున్నట్లు సమాచారం. సూపరింటెండెంట్‌తోపాటు ఇతర అధికారులు సమాచారం పంపినా స్పందించడం లేదని తెలుస్తోంది. ఇలా ఇష్టంలేని వైద్యులతో సూపర్‌ సేవలు ఎలా అందిస్తారని పేషెంట్లు ప్రశ్నిస్తున్నారు. తాము ఓపీ రోజుల్లో వైద్యం కోసం వచ్చి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు. ప్రైవేట్‌లో వైద్యం చేయించుకునే స్థోమత లేక సర్కారు వైద్యం కోసం వచ్చి చేయించుకోకుండానే ఇంటికి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోమవారం రాయపర్తికి చెందిన నాగమ్మ, గిర్నిబావికి చెందిన రాధమ్మ ఓపీ సేవలు లేకపోవడంతో ఇంటిబాట పట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement