యూనియన్‌ బలోపేతానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బలోపేతానికి కృషి చేయాలి

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

హన్మకొండ: యూనియన్‌ బలోపేతానికి కార్మికులందరూ కృషి చేయాలని ఐఎన్‌టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌ పిలుపునిచ్చారు. సోమవారం యూనియన్‌ 73వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండలోని సెక్షన్‌ కార్యాలయాలు, సబ్‌ స్టేషన్ల వద్ద యూనియన్‌ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని యూనియన్‌ కార్యాలయం పల్లా రవీందర్‌ రెడ్డి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 73 సంవత్సరాలుగా యూనియన్‌ను బలోపేతం చేస్తూ ఎన్నో పోరాటాలు నిర్వహించి కార్మికులకు హక్కులు సాధించిపెట్టిన ఘనత టీఎస్‌ ఈఈ యూకు దక్కిందన్నారు. కార్మికులకు హక్కులను సాధించి పెట్టడంలో ఎన్నో రాజీలేని పోరాటాలు నిర్వహించామన్నారు. టీఎస్‌ ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్‌ అధ్యక్షుడు పి.మహేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీలం ఐలేశ్‌, ఎన్పీడీసీఎల్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, వరంగల్‌ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్య గౌడ్‌, హనుమకొండ టౌన్‌ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సునీల్‌ కుమార్‌, ఉమేశ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

టీఎస్‌ ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement