జిల్లా స్థాయి క్రీడలు సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి క్రీడలు సమర్థవంతంగా నిర్వహించాలి

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నవంబర్‌ నెలలో జరగనున్న క్రీడలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి గుగులోతు దేశీరాంనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో శనివారం పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడ, మానుకోట డివిజన్లలో జిల్లా స్థాయి వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్‌, చెస్‌, క్యారమ్‌, అథ్లెటిక్‌ వివిధ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడలో నవంబర్‌ 3, 4వ తేదీల్లో క్రీడలు జరుగుతాయని, మానుకోటలో నవంబర్‌ 5, 6 తేదీలో క్రీడలు జరుగుతాయన్నారు. ఈ క్రీడలకు కొత్తగూడ సెక్రటరీగా పీడీ పద్మ, మానుకోట డివిజన్‌ సెక్రటరీగా పీడీ అనిల్‌ ఎంపికై నట్లు తెలిపారు. అనంతరం పీడీలు జిల్లా అధికారి దేశీరాంను సన్మానించారు. కార్యక్రమంలో ఏటీడీఓ ఉపేందర్‌, పీడీలు తదితరలు పాల్గొన్నారు.

జిల్లా గిరిజన శాఖ అధికారి దేశీరాంనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement