గార్ల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యాసంగిలో రైతులు వరిపంట సాగు చేయొద్దని కలెక్టర్ స్నేహ శబరీష్ రైతులకు సూచించారు. శ్రీకేత్ బచావో అభియాన్‌శ్రీ కార్యక్రమంలో భాగంగా గార్లలోని రైతువేదికలో రైతులకు ఎల్‌నినో ప్రభావంపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయి, నీటి లభ్యత లేనందున రైతులు యాసంగిలో వరిపంట సాగు చేయొద్దని తెలిపారు. చెరువులు, కుంటల్లో నీటి లభ్యత తక్కువ ఉందని.. తక్కువ నీటితో సాగుచేసే పంటలనే వేయాలని రైతులకు చెప్పారు. గార్ల మండలంలో 19,500 ఎకరాల సాగు భూమి ఉందని, 9,800 మంది రైతులు ఉన్నారని, 78 చెరువులు, కుంటలు ఉన్నాయని, వీటిలో నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. రైతులు ఆరుతడి పంటల సాగుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యుత్, నీరును పొదుపుగా వినియోగించుకోవాలని రైతులను కోరారు. ఆరుతండి పంటలు సాగు చేసి వరికంటే అధిక ఆదాయం పొందిన రైతులు గణేష్‌నాయక్, జక్కుల మహేష్, సుభాష్ చంద్రబోస్, నజీర్‌పాషా, వాంకుడోత్ వీర్యానాయక్, సర్పంచ్ బానోత్ పార్వతి.. బొప్పాయి, పెసర, బెండ, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్‌ఫామ్, పంటలు సాగు చేసి అధిక లాభాలు గడించిన వారితో కలెక్టర్ సమావేశంలో మాట్లాడించారు. వీబీజీ రామ్‌జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు వ్యవసాయ క్షేత్రాల వద్ద పంటకుంట, నీటికుంట, ఊటకుంట, ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రభత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రభుత్వం అందించే రాయితీలపై అవగాహన కల్పించారు. సమావేశం అనంతరం ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా పెసర విత్తనాలను పంపిణీ చేశారు. సమావేశంలో డీఏఓ విజయచంద్ర, డీఆర్‌డీఓ మధుసూదనరాజు, జినుగు మరియన్న, డాక్టర్ కిరణ్‌కుమార్, శ్రీనివాసరావు, ఈఈ పుష్పలత, ఎస్‌ఈ దర్శన్‌కుమార్, సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం, ఏఓ కె రామారావు, హెచ్‌ఓ శాంతిప్రియ, శాస్త్రవేత్తలు ప్రశాంత్, సుహాసిని పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. గార్ల పెద్దచెరువు శిఖం భూమిని కొందరు రైతులు కబ్జా చేశారని.. శిఖం భూమిని వెలికితీసి చెరువులో కలపాలని సీపీఎం జిల్లా నాయకుడు కందునూరి శ్రీనివాసరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్ స్నేహ శబరీష్


