నాకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో మా పాఠశాల ఉపాధ్యాయులంతా అండగా నిలబడ్డారు. చెవి ఆపరేషన్‌కు పాఠశాల వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షలు అందించారు. ఉపాధ్యాయులు ఇచ్చిన సహకారం, ధైర్యంతో క్షేమంగా ఇంటికి చేరాను. త్వరలో పాఠశాలకు వెళ్తా.. మంచిగా చదువుకొని మా ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెడతా.
– శ్యామ సంతోష్, పదో తరగతి జెడ్పీహెచ్‌ఎస్ డోర్నకల్
సైకిల్ ఇచ్చి ప్రోత్సహించారు
నేను గతేడాది జెడ్పీహెచ్‌ఎస్‌లో టెన్త్ పూర్తి చేశాను. తల్లిని కోల్పోయిన నన్ను ఉపాధ్యాయులు ప్రేమగా ఆదరించి విద్యాబుద్ధులు నేర్పారు. స్టూడెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా నాకు సైకిల్ ఇచ్చారు. పాఠశాలలో చదివిన రోజుల్లో ఉపాధ్యాయులు అన్ని విధాల అండగా నిలిచారు. ఇప్పుడు కూడా ఉన్నత చదువులకు సహకారం అందిస్తున్నారు. – అఫ్రోజ్ సనా, డోర్నకల్
●


