డోర్నకల్ జెడ్పీహెచ్ఎస్లో టెన్త్ వరకు చదివాను. చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులును గుర్తుపెట్టుకొని ప్రస్తుతం పాఠశాలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. బ్యాంకుకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి పాఠశాలలో పెయింట్లు, కంప్యూటర్లు వివిధ రకాల ఫర్నిచర్, సైకిళ్ల కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాం. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టూడెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ కోసం సొంతంగా కొంత డబ్బు ఖర్చు చేశాను. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి అభినందనీయం.
– గుగులోత్ వెంకట్రాం, పూర్వ విద్యార్థి, ఎస్బీఐ అధికారి
విద్యార్థులు ఇబ్బందులు పడితే చూడలేక..
జెడ్పీహెచ్ఎస్లో చదువుకునే విద్యార్థులందరికీ అన్ని విధాలుగా అండగా ఉండేందుకు స్టూడెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన వారికి పూర్తిస్థాయిలో ట్రస్ట్ అండగా ఉంటుంది. ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అందుతున్న సేవలను తెలుసుకొని దాతలు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. పాఠశాల ద్వారా అందుతున్న విద్యాపరమైన, సామాజిక సేవా పరమైన వసతులు, పాఠశాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో వెబ్ సైట్ ఏర్పాటు చేశాం.– బండి నరసింహారావు,
హెచ్ఎం, పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ డోర్నకల్


