జ్వరం, ఇతర కారణాలతో బడికి రాకుండా ఉన్నవారికి పాఠశాల ఉపాధ్యాయులను పంపించి వైద్యం చేయించడం, ట్రస్ట్‌లో ఉన్న డబ్బులతో మందులు ఇప్పించడం వంటి చర్చలు చేపట్టారు. ఇది చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్వరం, ఏదైనా సమస్య వచ్చినా.. ఉపాధ్యాయులే బాగా చూసుకుంటున్నారని భావించి ప్రతీరోజు బడికి పంపించారు. అదే విధంగా డోర్నకల్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పేదరికంతో ఆటోచార్జీలు చెల్లించలేని పరిస్థితి ఉండగా.. దాతల సహకారంతో తల్లిదండ్రులు, తల్లీ లేదా తండ్రి లేని పిల్లలను గుర్తించి వారికి సైకిళ్లు పంపిణీ చేశారు. అదే విధంగా కాళ్లు, చేతులు విరగడం వంటి గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించడం, ఇలా ఎనిమిదో తరగతి చవివే లావణ్య కాలువిరిగితే చికిత్స, పదో విద్యార్థి సంతోష్‌కు రూ.2 లక్షల వరకు ఖర్చుచేసి చెవి ఆపరేషన్ చేయించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. దేశ, విదేశాల్లో ఉన్నవారి సహకారంతో ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువులకు ఖర్చు చేసేలా మార్గం వేశారు. ఇలా ఇప్పటి వరకు సుమారు పది మందికి పైగా పాఠశాల పూర్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు.


