మహబూబాబాద్: ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పలు డిమాండ్లతో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం పదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. హోమియో పతిక్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పరికిపండ్ల అశోక్ సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులు ఉమాకర్, సరిత, రమ్య, రాజేశ్వరి, లలిత, సుమలత, తార, అరుణ, వనిత, రజిత తదితరులు పాల్గొన్నారు.


