మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మక్కలు పోటెత్తాయి. పండుగ అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో రైతులు అధికంగా మక్కలను విక్రయించేందుకు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్‌లోని కవరు షెడ్డు మొత్తం మక్కల రాశులతో నిండిపోయి కనిపించింది. 2,652 క్వింటాళ్లు (4,420 బస్తాలు) మక్కలు విక్రయం జరగగా.. గరిష్ట ధర క్వింటాకు రూ.2,895, మోడల్‌ ధర రూ.2,870, కనిష్ట ధర రూ.2,140 పలికిందని ఏఎంసీ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, సెక్రటరీ వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. అదే విధంగా 51 క్వింటాళ్ల (146 బస్తాలు) పత్తి విక్రయం జరగగా.. గరిష్ట ధర క్వింటాకు రూ.9,226, మోడల్‌ ధర రూ.9,223 పలికిందని పేర్కొన్నారు. వరి ధాన్యం హెచ్‌ఎంటీ రకం మూడు క్వింటాళ్లు విక్రయానికి రాగా.. క్వింటాకు ధర రూ.4,680 చొప్పున పలికిందని తెలిపారు.

గెలుపే లక్ష్యంగా

పనిచేయాలి

నెల్లికుదురు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ పార్టీ నాయులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పులి వెంకన్న, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవరెడ్డి, నాయకులు సత్యపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్‌, మండల యూత్‌ అధ్యక్షుడు రాజేష్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జాతీయస్థాయి

రగ్బీ పోటీలకు ఎంపిక

డోర్నకల్‌ : డోర్నకల్‌లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌–14 బాలుర రగ్బీ పోటీల్లో గుగులోత్‌ మదన్‌ నాయక్‌, అండర్‌–17 బాలికల విభాగంలో నల్లమాండ్ల నవ్యశ్రీ ప్రతిభ కనబర్చి ఈ నెల 23నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను ఎంఈఓ ఆంగోత్‌ లక్ష్మానాయక్‌, హెచ్‌ఎం బండి నర్సింహరావు, పీడీ రవికుమార్‌ తదితరులు అభినందించారు.

సమగ్ర చట్టం

తీసుకురావాలి

గంగారం : వ్యవసాయ కూలీలకు ప్రభుత్వాలు సమగ్ర చట్టం తీసుకురావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సాదుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని దుబ్బగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం సంఘం అధ్యక్షుడు జనగాం వీరస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించి రోజుకు రూ.800 వేతనం అందించాలన్నారు. పోడు సాగుదారులకు ప్రభుత్వ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు.

నేడు పలు అభివృద్ధి

కార్యక్రమాల ప్రారంభోత్సవం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్‌ హాస్టల్‌నుంచి కెనాల్‌ సమీపంలోని కో ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వరకు రూ.1.34 కోట్ల వ్యయంతో కిలోమీటర్‌ మేర చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా పరీక్షల విభాగం పక్కనే రూ1.67 కోట్ల వ్యయంతో పరీక్షల విభాగం రెండో బ్లాక్‌ భవనం నిర్మించారు. ఈ రెండు అభివృద్ధి పనులను నేడు (శుక్రవారం) కేయూ వీసీ కె ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం.. అభివృద్ధి అధికారి ఆచార్య వై.వెంకయ్యలతో కలిసి ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement