బ్రహ్మోత్సవాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు వేళాయె

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

● రేపటి నుంచి ఈనెల 31వరకు వేట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

● ముస్తాబైన మర్రిగూడెం దేవాలయం

గార్ల: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే గార్ల సమీపంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్‌ అజ్మీరా బన్సీలాల్‌ గురువారం తెలిపారు. మండల కేంద్రమైన గార్లకు 3 కిలోమీటర్ల దూరంలోని మర్రిగూడెం గ్రామంలో వెలసిన వేట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అశ్వయుజ మాసంలో వారంరోజుల పాటు ఎంతో అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు కాగా, అధికారులు భక్తుల సౌకర్యార్థం దేవాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆలయ ప్రాశస్త్యం..

తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారు స్వయంగా వేట మార్గం ద్వారా ఈ ప్రాంతానికి విచ్చేసి మర్రిగూడెం సమీపంలోని జువ్విచెట్టు కింద అవతరించినట్లు పూర్వీకులు, భక్తుల విశ్వాసం. సుమారు 522 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి రామాయణం వెంగలయ్య అనే నిరుపేద చాత్తాద ౖవైష్ణవుడికి వేంకటేశ్వరస్వామి దర్శనమిచ్చి తనకు ఇక్కడ ఒక దేవాలయం నిర్మించి నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించాలని ఆజ్ఞాపించగా వెంగలయ్య గ్రామ ప్రముఖుల సహకారంతో ఆలయం నిర్మించినట్లు ఈ ప్రాంత పూర్వీకులు చెప్పుకుంటారు. కాగా సుందర మూర్తులైన వేంకటేశ్వరస్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఒంటిమీసం తోట అనే ఉద్యానవనంలో లభ్యం కాగా, ోర్నకల్‌ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన మల్లం గోపయ్య, మల్లం నర్సయ్య ఇక్కడకు విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. కాగా, నాటి నుంచి వంశపారపర్యంగా మల్లం వంశస్తులు వేంకటేశ్వర స్వామి వారి కల్యాణానికి ప్రతీఏటా తలంబ్రాలు తీసుకొస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement