రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

● వీసీలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

● ఖేత్‌ బచావో అభియాన్‌ ప్రారంభం

మహబూబాబాద్‌ రూరల్‌ : యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు, అపరాలు, కూరగాయలు సాగుచేసి అధిక లాభాలుపొందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను సూచించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వ్యవసాయశాఖ ఉన్నత అధికారులు సురేంద్రమోహన్‌, గోపి, యాస్మిన్‌ బాష, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఏటిగడ్డతండా రైతు వేదిక నుంచి డీఏఓ విజయచంద్ర, జిల్లా పశు వైద్యాధికారి కిరణ్‌ కుమార్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, జిల్లా మార్కెటింగ్‌ అధికారి నరేందర్‌, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రవి, తదితర రైతు సహకార సంఘం నాయకులు వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. పత్తికి మంచి డిమాండ్‌ ఉందని, కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందాల సభ్యులతో క్షేత్రస్థాయిలో రైతులకు అర్థమయ్యే విధంగా పాటల రూపంలో పంట మార్పిడి, ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని సూచించిన షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మానుకోట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, రైతులు వల్లూరి కృష్ణారెడ్డి, కొలిశెట్టి సత్యనారాయణతో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడారు. నూతన సాగు విధానం, ఆరుతడి పంటలు, పంట మార్పిడి, ఆయిల్‌ పామ్‌ ఇతర అధిక డిమాండ్‌ ఉన్న తక్కువ నీటి వనరులతో పండే పంటలను పండించి రైతులకు ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement