ఉద్యోగుల సమ్మె.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమ్మె..

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

– IIలోu

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

నెహ్రూసెంటర్‌: జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె గురువారం పదో రోజుకు చేరుకుంది. ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో ఉండడంతో వైద్య ఆరోగ్య సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మెలో భాగంగా నిరసన తెలుపుతున్నారు. ఉద్యోగులకు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు.

జిల్లాలో 441 మంది ఉద్యోగులు..

ఎన్‌హెచ్‌ఎం పరిధిలో జిల్లా వ్యాప్తంగా 441 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో డాక్టర్లు, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ల్యాబ్‌ టెక్నీషియన్లు, స్టాఫ్‌నర్సు, ఫార్మసిస్టులతో పాటు ఇతర వైద్య విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం దక్కడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులతో చర్చించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఉద్యోగులు కోరుతున్నారు.

అంతరాయం..

ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రతీ బుధ, శనివారం టీకాల పంపిణీ కార్యక్రమంతో పాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఉద్యోగులు వైద్య సేవలు అందిస్తారు. సమ్మె టీకాల పంపిణీపై ప్రభావం చూపుతోంది. దీంతో పాటు గర్భిణులు చెకప్‌, సీజనల్‌ వ్యాధులు నిర్మూలన, రౖఫైడే డ్రైడే తో పాటు షుగర్‌, బీపీ మందుల పంపిణీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

ఎండిపోతున్న పంటను చూపుతున్న రైతులు

పదో రోజుకు చేరిన

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె

నిలిచిపోయిన వైద్య సేవలు

ఉద్యోగ భద్రత, సమాన వేతనం కోసం సిబ్బంది డిమాండ్‌

పోటాపోటీగా ఓటర్ల నమోదు..

సన్నాహక సమావేశాలు

గెలుపే లక్ష్యంగా నేతల మోహరింపు.. వ్యూహాలకు పదును

పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే

పనిలో పార్టీలు..

నోటిఫికేషన్‌కు ముందే ‘ఎమ్మెల్సీ’హీట్‌..

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఎన్‌హెచ్‌ఎంలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇంక్రిమెంట్‌, బోనస్‌, పీఆర్‌సీ సౌకర్యం అందించాలి. 20 ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగుల శ్రమను గుర్తించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

– ఉమాకర్‌, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ

జిల్లా అధ్యక్షుడు

తక్కువ వేతనాలతో పనిచేస్తున్నాం

సంవత్సరాల నుంచి తక్కువ వేతనాలతో పని చేస్తున్నాం. కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలు అందించాం. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి ఇవ్వాలి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి.

– సరిత, రెండో ఏఎన్‌ఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement