ఎస్‌ఎంలో అపరిచితులతో స్నేహం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంలో అపరిచితులతో స్నేహం వద్దు

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

హసన్‌పర్తి: సోషల్‌ మీడియా(ఎస్‌ఎం)లో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయొద్దని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. బాలికల భద్రత, మహిళారక్షణ, వ్యక్తిగత అభివృద్ధి, సైబర్‌ నేరాలు, మానసిక ఆరోగ్యంపై బుధవారం నగరంలోని కాళోజీ కళాక్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ శ్వేత ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. బాలికలు తమ హక్కులు, రక్షణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యక్తిగత స మాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దన్నారు. సైబ ర్‌ వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ కౌమారదశలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా అఽధిగమిస్తూ జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగా లని పిలుపునిచ్చారు. పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు మానసిక, భావోద్వేగ, సమతుల్యతను కాపాడుకోవాలన్నారు. సైకాలజిస్ట్‌ బరుపటి గోపి మాట్లాడుతూ మానసిక అడ్డంకులను అధిగమిస్తూ జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. గైనకాలజిస్ట్‌ ఎల్‌.రాధిక మాట్లాడుతూ కౌమారదశలో కలిగే శారీరక,మానసిక మార్పులపై బాలికలకు అవగాహన ఉండాలన్నారు. జిల్లా ‘షీ’ టీమ్స్‌ ఏసీసీ సదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీపీలు అంకిత్‌కుమార్‌, ధార కవిత, అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీలు సదయ్య, వెంకటరమణ, ‘షీ’టీమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సువర్ణ, ఎహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్‌ ఓ. రమేశ్‌, భరోసా సెంటర్‌ ఎస్సై కిరణ్మయి. ‘షీ’ టీమ్స్‌ ఆర్‌ఎస్సై స్వాతి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

సైబర్‌ వేధింపులకు గురైతే

సమాచారమివ్వాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement