తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. | - | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

పెద్దవంగర : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు అ ప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసు ను ఛేదించారు. సీఐ గణేశ్‌, ఎస్సై ప్రమోద్‌ కుమార్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా పె ద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన గద్దల పద్మ బంధువుల వద్దకు వెళ్లగా కూ తురు సుమభావన ఇంట్లో ఒక్కరే ఉంది. బుధవా రం రాత్రి తల్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో నిద్రించింది. గురువారం ఉదయం ఇంటికి రాగానే తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూసేసరికి బీరువాలో భద్రపరిచిన 8 తులాల బంగారు ఆభరణాలు కని పించలేదు. దీంతో వెంట నే తల్లికి సమాచారం అందించింది. దీనిపై బాధితురాలు పద్మ వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీ సులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మండల కేంద్రంలో అదే (అవుతాపురం) గ్రామానికి చెందిన మహంకాళి యాకయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ, ఎస్సై తెలిపారు.

8 తులాల బంగారం అపహరణ

గంటల వ్యవధిలోనే దొంగ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement