కేంద్ర ప్రభుత్వం పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలి. అసలే రైతులు అష్టకష్టాలతో పంటలు సాగు చేస్తుంటే తమ నడ్డివిరిచే విధంగా ధరలు పెంచి అగాధంలోకి నెట్టివేస్తుంది. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల రేట్లు ఇష్టారాజ్యంగా పెంచడం విచారకరం. వర్షాలు రావడం ఆలస్యమై కర్షకులు బాధపడుతుంటే పంటల సాగుకు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కదా అని ధరల పెంపుదల చేయడం ఎంతవరకు సమంజసం.
– బోళ్ల సందీప్ రెడ్డి, రైతు, ఆమనగల్
రైతులపై అదనపు భారం
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. నేను మూడు ఎకరాల్లో వరి, ఒక ఎకరం మిర్చి, రెండు ఎకరాల్లో కూరగాయలు, పెసర పంట సాగు చేయబోతున్నాను. మొత్తం పంటల సాగుకు సంబంధించి 13 బస్తాల అడుగు మందు కొనుగోలు చేయాలి. ప్రస్తుత సీజన్‌లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో వేల రూపాయల్లో ఖర్చులు పెరుగుతాయి.
– దొడ్డ సాగర్, రైతు, మల్యాల


