గార్ల: పాఠశాలల వారీగా విద్యార్థుల నమోదు లక్ష్యాలను ఉపాధ్యాయులు సాధించాలని డీఈఓ ఎం. సత్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం డీఈఓ తనిఖీ చేసి ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం నాటికి పరిసరాలు, వాటర్‌ట్యాంక్‌లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట ఏఎంఓ వెంకటేశ్వర్లు, జీసీడీఓ గాయత్రి, పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
మానవ మనుగడకు అడవులే ఆధారం
గూడూరు: మానవ మనుగడకు, భూమిపై జీవకోటికి అడవులు ప్రాణధారమని ఎఫ్‌ఆర్వో ప్రసాదరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గూడూరు అటవీశాఖ రేంజ్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అడవుల ప్రాముఖ్యత, రక్షణ, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్వో మాట్లాడుతూ.. జీవ వైవిధాన్ని కాపాడటంతో పాటు ఆక్సిజన్ అందిస్తూ, వర్షాలు పడడానికి, వాతావరణ సమతుల్య తకు అడవులు సహాయపడుతాయన్నారు. అలాంటి అడవులను, వన్యప్రాణులను, అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వాంకుడోతు సునీతకొమ్మాలు, ఎంపీడీఓ సత్యనారాయణ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేయాలి
నెహ్రూసెంటర్: బిర్సాముండా పోరాటస్ఫూర్తితో ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు సాగించాలని గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ కిషన్‌నాయక్ అన్నారు. గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బిర్సాముండా వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బిర్సాముండా ఆది వాసీల అస్తిత్వం కోసం జల్–జంగల్–జమీన్ నినాదంతో అటవీపై సర్వ హక్కులు ఆదివాసీలకే దక్కాలని, ఆదివాసీల విముక్తి కోసం పోరా టాలు సాగించారని గుర్తు చేశారు. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం పోరాటాలకు ఆదివాసీ గిరిజనులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిత్తారి సోమన్న, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రాంమూర్తి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న, డీబీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోలెపాక వెంకన్న, గణేష్, ఆంగోత్ కిషన్‌నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


