● మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్
మహబూబాబాద్: పారిశుద్ధ్య కార్మికులు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై చెత్తను వెంటనే తొలగించాలని కమిషనర్ వినోద్‌కుమార్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యపై ఈనెల 7న సాక్షి దినపత్రికలో ‘పారిశుద్ధ్యం గాడిన పడేనా?’ అనే శీర్షిక నప్రచురితమైన కథనంపై సోమవారం కమిషనర్ వినోద్‌కుమార్ స్పందించారు. మార్వాడీ బజార్‌తో పాటు రెడ్డి బజార్‌లో పారిశుద్ధ్య పనులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పారిశుద్ధ్య సమస్యలకు గల కారణాలపై ఆరా తీసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి, జవాన్లు శ్రీను, చిరంజీవి పాల్గొన్నారు.


