జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నేడు (మంగళవారం) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్‌స్టేషన్లను ప్రారంభించడంతోపాటు మరో 3 సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు హాజరుకానున్నారు.
భూ హద్దుల గుర్తింపులో వేగం పెంచాలి
మహబూబాబాద్: భూముల రీ సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్ష పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న జిల్లాలో సమన్వయంతో సర్వే త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో క్షేత్రస్థాయిలో సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్‌శాఖ ద్వారా ఆర్‌ఓఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
లైసెన్స్ లేకుండా నారు విక్రయిస్తే చర్యలు
డోర్నకల్/కురవి: నర్సరీ నిర్వాహకులు లైసెన్స్ లేకుండా మిరప, కూరగాయల నారు విక్రయిస్తే నర్సరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి జినుగు మరియన్న హెచ్చరించారు. డోర్నకల్, కురవి మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించిన మరియన్న నర్సరీలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సరీ చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించా రు. ఆరుబయట నారు పెంచవద్దని, లైసెన్స్ లేకుండా ఎలాంటి నారు విక్రయించొద్దని హె చ్చరించారు. వ్యవసాయశాఖ ఆమోదం పొందిన విత్తనాలనే నర్సరీలో నాటాలని, కల్తీ విత్తనాలతో నారు పోసేవారిపై పీడీ యాక్ట్ ప్రకా రం కేసులు పెడతామని అన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా అటవీశాఖ కార్యాలయ ఆవరణలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీలను సోమవారం పంపిణీ చేశారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులు సామాన్య వ్యక్తులతో సమానంగా పోటీ పడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ బత్తుల, టీజీఎఫ్‌డీసీ సీజీఎం డీవీ.రెడ్డి, జీఎం స్కైలాబ్, ఇన్‌చార్జ్ డివిజనల్ మేనేజర్ శైలజ, ప్లాంటేషన్ మేనేజర్ కరుణాకర్ రావు, ఎఫ్‌డీఓ వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఆర్‌ఓలు సురేష్, విజయలక్ష్మి, రాకేష్, ఇనుగుర్తి డీపీఎం రాకేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.


