వరంగల్ స్పోర్ట్స్: బీసీసీఐ ఆమోదంతో ఈనెల 20 నుంచి జూలై 11వ తేదీ వరకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న టీ–20 (టీజీ20) లీగ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల్లో నలుగురికి చోటు దక్కింది. క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా వేలంలో ప్రముఖ 8 ఫ్రాంచైస్ కొనుగోలు చేయగా అందులో వరంగల్ జిల్లా క్రీడాకారులు నలుగురు ఎంపికై నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న వారిలో జంబోజు పార్దిపన్(ఆల్ రౌండర్)ను రూ. 75 వేలకు పాలమూరు స్ట్రైక్ జట్టు, బానోత్ సతీశ్ కుమార్(ఫాస్ట్ బౌలర్)ను కరీంనగర్ డిమాండ్స్ జట్టు రూ. లక్షకు, విశ్వనాథ వైష్ణవ్ (ఆల్ రౌండర్– లెగ్ స్పిన్నర్ కం బ్యాట్స్‌మన్ )ను రూ. లక్షకు వరంగల్ వారియర్స్ జట్టు, బీరవోలు నాగ సుధామ్ష్ రెడ్డి(ఆల్ రౌండర్–లెగ్ స్పిన్నర్ కం బ్యాట్స్‌మన్)ని నల్లగొండ కింగ్స్ జట్టు రూ.75 వేలకు కొనుగోలు చేశారు. కాగా, టీజీ–20 కి ఎంపికై న క్రీడాకారులను వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అభినందించింది.
సుధామ్ష్‌రెడ్డి, విశ్వనాథ వైష్ణవ్, సతీశ్‌కుమార్, పార్దిపన్


