భర్తను వదిలి బంగారం, డబ్బుతో వెళ్లిపోయిన భార్య.. | - | Sakshi
Sakshi News home page

భర్తను వదిలి బంగారం, డబ్బుతో వెళ్లిపోయిన భార్య..

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

అవమానభారంతో పురుగుల మందు తాగిన భర్త

పర్వతగిరి: భార్య.. భర్తను వదిలి డబ్బులు, బంగారం, ఇతర సామగ్రితో వెళ్లిపోయింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... పుట్ట నరేశ్‌ అనే వ్యక్తి ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గీసుగొండ మండలం మునుగొండకు చెందిన గుల్లపల్లి గాయత్రితో మార్చి 15, 2026న వివాహం జరిగింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి సోమవారం గూడ్స్‌ వాహనాన్ని రప్పించి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంటిలోని ఐదు తులాల బంగారం, రూ.2.5లక్షల నగదు, ఇతర సామగ్రి తీసుకుని వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికిన నరేశ్‌ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆదివారం అవమాన భారం భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పతికి తరలించారు. ప్రస్తుతం నరేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement