గన్‌ గురి పెడితే పతకమే.. | - | Sakshi
Sakshi News home page

గన్‌ గురి పెడితే పతకమే..

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

కమలాపూర్‌ : ఆ క్రీడాకారిణి గన్‌ గురి పెడితే పతకమే. వెనుదిరిగే సమస్యే లేదు. పద్నాలుగేళ్ల ప్రాయంలోనే షూటింగ్‌ క్రీడలో రాణిస్తోంది. అండర్‌–14, 17, 19, సీనియర్‌ కేటగిరీల్లోనూ ప్రతిభ కనబరుస్తోంది. 2 గోల్డ్‌, 3 బ్రౌంజ్‌, 11 సిల్వర్‌ మెడల్స్‌ సొంతం చేసుకోవడంతోపాటు మూడు సార్లు జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించింది. అంతేకాకుండా రెండు సార్లు ఇండియన్‌ టీమ్‌ ట్రయల్స్‌లో పాల్గొని ఔరా అనిపిస్తోంది. ఇటు షూటింగ్‌లో అటు చదువులోనూ రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతోంది. ఆమె హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరం గ్రామానికి చెందిన సంగెం చంద్రశేఖర్‌, శృతి దంపతుల కూతురు తాన్సీ. హైదరాబాద్‌లోని విద్యానికేతన్‌ మోడల్‌ హైస్కూల్‌లో ఇటీవల పదో తరగతి పూర్తి చేసిన తాన్సీ 515/600 మార్కులు సాధించింది. ఈ నెలలో హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి షూటింగ్‌ పోటీలకు సన్నద్ధమవుతోంది.

స్పాన్సర్ల కోసం ఎదురుచూపులు..

చిన్న వయస్సులోనే షూటింగ్‌లో ప్రతిభ కనబరుస్తూ పతకాలతోపాటు పలువురి ప్రశంసలు అందుకుంటున్న తాన్సీ స్పాన్సర్ల కోసం ఎదురుచూస్తోంది. ఎవరైనా ముందుకొస్తే వారి సహకారంతో మ రింత రాణించి పతకాలు సాధిస్తానంటోంది.

షూటింగ్‌ క్రీడలో రాణిస్తున్న తాన్సీ

2 గోల్డ్‌, 3 బ్రౌంజ్‌, 11 సిల్వర్‌ మెడల్స్‌ సొంతం

అండర్‌–14, 17, 19, సీనియర్‌ కేటగిరీల్లో ప్రతిభ

3 సార్లు నేషనల్స్‌, 2 సార్లు

ఇండియన్‌ ట్రయల్స్‌లో ప్రాతినిథ్యం

Advertisement
 
Advertisement
Advertisement