‘చేనేత’ ఉపాధికి నష్టం కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

‘చేనేత’ ఉపాధికి నష్టం కలిగించొద్దు

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

కలెక్టరేట్‌ ఎదుట కార్మికుల ధర్నా

వినతిపత్రం అందజేసిన నాయకులు

న్యూశాయంపేట : చేనేత ఉపాధికి నష్టం కలిగించొద్దని కార్మికులు సోమవారం వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన మేటిరియల్‌ (కార్పెట్స్‌, బెడ్‌షీట్స్‌) ఏకీకృత టెండర్‌ విధానాన్ని తొలగించి యథావిధిగా టెస్కో సంస్థకు ఆర్డర్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌ సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు స్పందించి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందించేందుకు అనుమతించగా నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. బీజేపీ నాయకులు కుసుమ సతీష్‌, సీపీఐ నాయకులు టి. వెంకట్రాములు, చేనేత సంఘం నాయకులు డి.సత్యనారాయణ, సంపత్‌, వెంకటమల్లు, సాంబయ్య, భద్రయ్య, కుమారస్వామి, రాజేందర్‌, రమేష్‌, ఓదేలుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఎంసీపీఐ ఆధ్వర్యంలో..

ధరలను అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్‌ విమర్శించారు. సోమవారం వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.చందర్‌రావు, జి.కుమారస్వామి, సాంబయ్య, ప్రతాప్‌, ఎం.సాగర్‌, సంధ్య, రామస్వామి, ఇస్మాయిల్‌, రమేష్‌, నర్సయ్య, సమ్మయ్య, గోవర్దన్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

నాసిరకం విత్తనాలను అరికట్టాలని..

నాసిరకం విత్తనాలను అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి పేర్కొన్నారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. నాయకులు ఎం.పాణి, కొమురయ్య, లింగయ్య, సాగర్‌, మెహన్‌, శ్రీను, కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement