న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026
● మార్చిలో రూ.60, ప్రస్తుతం రూ.29 పెరుగుదల
● పేదలపై ఆర్థికభారం
● వినియోగదారులకు ఓటీపీ కష్టాలు
మహబూబాబాద్/మరిపెడ రూరల్: కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో రెండుసార్లు వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచింది. మార్చిలో రూ.60, ప్రస్తుతం రూ.29 పెంచడంతో పేదలపై ఆర్థికభారం పడుతుంది. గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో 2,11,531 కనెక్షన్లు..
జిల్లాలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ(హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓ సీఎల్), భారత్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ (బీఓసీఎల్)కి చెందిన 2,11,531 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి 7న గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచింది. అప్పటి వరకు రూ.924 ఉన్న సిలిండర్ ధర రూ.984కి చేరింది. కాగా ప్రస్తుతం సిలిండర్ ధర రూ.29పెంచింది. మొత్తంగా సిలిండర్ ధర రూ.1,013కి చేరింది.
అందని సబ్సిడీ..
చాలామంది వినియోగదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ రావడం లేదు. దీంతో ప్రతీరోజు వినియోగదారులు డీలర్ కార్యాలయాలు, బ్యాంక్‌లు, డీసీఎస్‌ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ సబ్సిడీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని గ్యాస్ ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఓటీపీ కష్టాలు..
ఓటీపీ ఉంటేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్‌కు వినియోగదారుడి సెల్‌ఫోన్ నంబర్ అనుసంధానం చేయాలి. గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. దానిని డెలివరీ బాయ్‌కు చెబితేనే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. దీంతో సెల్‌ఫోన్, గ్యాస్ పుస్తకంతో వినియోగదారుడు గ్యాస్ ఆఫీస్‌కు వెళ్లి అనుసంధానం చేసుకోవాల్సి వస్తోంది. దీంతో పాటు ఈ–కేవైసీ తప్పనిసరి అయింది. దానికోసం కార్యాలయం వెళ్లి ఐరిస్ స్కాన్ చేసుకోవాలి. ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలి. లేకుంటే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరగదని, ప్రధానంగా సబ్సిడీ రాదని చెబుతున్నారు.
మోయలేని భారం..
నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలు వరుసగా పెంచుతూ సామాన్యుడిపై మోయలేని భారం మోపుతున్నారు. పెంచిన ధరలు తగ్గించి పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే పేద, మధ్యతరగతి ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు చూడాల్సి వస్తుంది.
– బాణాల రాజన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, మరిపెడ
మూడు నెలల్లో రెండుసార్లు వంటగ్యాస్ ధర పెంపు
దీపం పథకం
34,314
ప్రధానమంత్రి ఉజ్వల పథకం32,379
సీఎస్‌ఆర్ (హాస్టళ్లు)
8,659
మొత్తం కనెక్షన్లు
75,352
వామ్మో.. జూన్!
కంపెనీ డీలర్ కేంద్రం కనెక్షన్లు
హెచ్‌పీసీఎల్ మానుకోట 36,839
కురవి 21,055
బయ్యారం 6,304
గూడూరు 1,90
ఐఓసీఎల్ మానుకోట 2,863
డోర్నకల్ 6,226
మరిపెడ 14,957
నెల్లికుదురు 3,657
కేసముద్రం 1,540
బీఓసీఎల్ గార్ల 2,240
నర్సింహులపేట 8,845
తొర్రూరు 30,563
మొత్తం 1,36,179


