వీరన్న సన్నిధిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలో భక్తులు బారులుదీరారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు.

గంజాయి రవాణాదారుడి అరెస్టు

మహబూబాబాద్‌ రూరల్‌ : గంజాయి రవాణాదారుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ ఎన్‌.అంజలి అన్నారు. రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం అరెస్టు వివరాలను ఆమె వెల్లడించారు. గత మార్చిలో గంజాయి రవాణా చేసిన నిందితుడు పాయలి క్రాంతికుమార్‌ కదలికలను జిల్లా కేంద్రంలోని అడ్వకేట్‌ కాలనీ గుర్తించి పట్టుకున్నామన్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించి సెల్‌ఫోన్‌ రికవరీ చేశామని తెలిపారు. గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితులపై పీడీ యాక్ట్‌ పెడతామని, గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రూరల్‌ ఎస్సై ఫై.రాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ, శంకర్‌, మధుసూదన్‌, పీసీలు సంతోష్‌, విజయ్‌, ఈర్యా తదితరులు పాల్గొన్నారు.

ఇంగ్లిష్‌ పరీక్షకు

46 మంది హాజరు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో ఆదివారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్షకు 46 మంది విద్యార్థులు హాజరై, ఆరుగురు గైర్హాజరైనట్లు డీఈఓ సత్యనారాయణ మూర్తి తెలిపారు. సోమవారం జరగనున్న మ్యాథ్స్‌ పరీక్షకు విద్యార్థులు తప్పకుండా హాజరుయ్యేవిధంగా ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు.

నేటి నుంచి కేయూ దూరవిద్య పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి దూరవిద్య సీడీఓఈ/ఎస్‌డీఎల్‌సీఈ ఎంఏ, ఎంకామ్‌, హెచ్‌ఆర్‌ఎం, జేఎంసీ, ఎమ్మెస్సీ కోర్సుల (2023–24 బ్యాచ్‌) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పద్మజ తెలిపారు. ఈనెల 8, 10, 12, 15, 17, 19, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 2,354 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.

కేయూ బాటనీ విభాగం అధిపతిగా మమత

కేయూ క్యాంపస్‌: కేయూ బాటనీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌, కెమిస్ట్రీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మమతను నియమిస్తూ (తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు) రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఈనెల 6న సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. ప్రొఫెసర్‌ లలితాకుమారి ఇప్పటివరకు బాటనీ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీ కాలం ముగియగా మళ్లీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ అధికారులు కొనసాగించడం లేదు. దీంతో మమతను బాటనీ విభాగం అధిపతిగా నియమించారు.

వారిలో ఒకరికి అవకాశం?

యూనివర్సిటీలోని బాటనీ విభాగంలో ఒక్కరు రెగ్యులర్‌ ప్రొఫెసర్‌, ఐదుగురు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌నే బాటనీ విభాగం అధిపతిగా నియమిస్తారా అనేది చర్చనీయాంశమైంది. సీని యారిటీని పరిగణనలోనికి తీసుకొని విభాగం అధిపతిగా కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను నియమించాలని వీసీ, రిజిస్ట్రార్‌ను కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కోరినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement