మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. సెలవురోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భక్తులు భారీ సంఖ్యలో వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు.


