సంగెం: కాలం చెల్లిన పురుగు మందులు పట్టుకున్నట్లు సంగెం మండల వ్యవసాయాధికారి బి.జగదీశ్వర్ తెలిపారు. పల్లారుగూడ గ్రామంలోని మహేశ్వర ఏజెన్సీస్‌లో కాలం చెల్లిన పురుగుల మందులు నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. రూ.1,38,904 విలువైన వివిధ కంపెనీలకు చెందిన 213 కాలం చెల్లిన పురుగు మందులు లభించాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని యజమాని వేములపల్లి హరీశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. వ్యవసాయాధికారి జగదీశ్వర్ ఫిర్యాదు మేరకు కాలం చెల్లిన పురుగు మందులను సీజ్ చేసి, హరీశ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.


