నేను గీసిన బొమ్మ | - | Sakshi
Sakshi News home page

నేను గీసిన బొమ్మ

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన యూకేజీ విద్యార్థిని గూడూరి దాక్షిణ్యారెడ్డి గీసిన చిత్రం

జేఎస్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలకేంద్రానికి చెందిన మార్క ప్రీతిమేఘన గీసిన చిత్రాలు

వేసవి సెలవుల్లో బాలబాలికలు ఖాళీగా ఉండకుండా పలు క్రీడలు, కళలు నేర్చుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా బొమ్మలు గీయడంపై ఆసక్తి కనబర్చుతున్నారు. వివిధ రకాల చిత్రాలు గీస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.

భానుశ్రీ

టీ కప్పులతో కట్టేస్తా.. ఆడేస్తా

సెల్‌ ఫోన్‌కు దూరంగా ఉంటూ కాగితపు టీ కప్పులను ఆటకు పరికరంగా మార్చేస్తున్నాడు పరకాలకు చెందిన 3వ తరగతి విద్యార్థి పోల్నా టి మణితేజ. టీ కప్పులను ఎవరు ఎత్తుగా పేర్చితే వారే విజేతగా నిలిచేలా స్నేహితులు, తన చెల్లితో టీ కప్‌ గేమ్‌ ఆడుతున్నాడు. పోటీలో ఉన్నవారు కొంత దూరంలో ఉండి ఊదుతూ ఉండగా వీటిని పేర్చడం మరింత జోష్‌ నింపుతోంది. –పరకాల

గురువు సహాయం

లింగాలఘణపురం : జనగామ పట్టణానికి దగ్గరగా పెంబర్తి అనే గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కూతురు. ఆమె పేరు వరలక్ష్మి. చక్కని లక్షణాలు కలిగిన అమ్మాయి. కానీ ఆమె తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడుతుండేవారు. అది చూసి ఆమె ఎంతో బాధపడేది. కొద్ది రోజుల తర్వాత కుటుంబ గొడవలతో లక్ష్మమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. రామయ్య కూడా తన సంతోషం, సరదాల కోసం ఎక్కడికో వెళ్లిపోయాడు. పాపం వాళ్ల నానమ్మ వరలక్ష్మిని పెంచి పోషించింది. చదివించే స్తోమత లేక ఎప్పుడు బాధపడేది. ఒక రోజు బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు వరలక్ష్మి ఇంటికి వచ్చి పాపను బడిలో చేర్పిండి అని అడిగారు. వాళ్ల నానమ్మ చదివించే స్తోమత లేదని చెబుతుంది. అప్పుడు ఉపాధ్యాయులు ఇలా అన్నారు. మాది ప్రభుత్వ బడి. మేము ఉచితంగా చదువు చెబుతాము. పుస్తకాలు, రెండు జతల దుస్తులు ఇస్తాము. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం కూడా పెడుతామని చెప్పారు. ఆ ఊరు చిన్నది కావడం వల్ల ఐదో తరగతి వరకే ఉంది. పై చదువుల కోసం ఒక ఉపాధ్యాయురాలిని సహాయం అడుగుతుంది. అప్పుడు ఆ ఉపాధ్యాయురాలు గురుకుల పాఠశాల గురించి వివరించి పరీక్ష రాయించింది. అప్పుడు వరలక్ష్మి హాస్టల్‌లో ఉంటూ ఉన్నత చదువు కొనసాగించింది. వరలక్ష్మి సాధించిన విజయాల గురించి పత్రికలు, టీవీల్లో ప్రసారం చేశారు. వరలక్ష్మి గొప్పతనాన్ని తెలుసుకున్న రామయ్య, లక్ష్మమ్మ తమ తప్పు తెలుసుకొని తమ దగ్గరికి తెచ్చుకొని కలిసి మెలిసి ఉంటారు. వరలక్ష్మి ప్రభుత్వ ఉద్యోగం సాధించి అమ్మానాన్నలను సంతోష పెడుతుంది. తన జీవితానికి బాటలు వేసిన ఉపాధ్యాయులను వరలక్ష్మి ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఘనంగా సత్కరించింది.

పిల్లలతో వ్యాయామం

బయ్యారం: వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటున్న పిల్లలతో ఓ ఉపాధ్యాయుడు వ్యాయా మం చేయిస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యా రం మండలం సింగారం గ్రామానికి చెందిన జి.మోహన్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సెలవుల్లో ఇంటి వద్ద ఉంటున్న మోహన్‌ తమ గ్రామంలోని పిల్లలను ఉదయం వేళ ఒక చోటకు చేర్చి వ్యాయామంతో పాటు ఆటలు నేర్పిస్తున్నారు.

ఎం. అంజన, 6వ తరగతి, మోడల్‌ స్కూల్‌, లింగాలఘణపురం

విద్యార్థిని చెప్పిన కథ

Advertisement
 
Advertisement
Advertisement