స్కూల్‌ లైబ్రరీల బలోపేతం.. | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ లైబ్రరీల బలోపేతం..

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల కోసం ఉన్న లైబ్రరీల్లో కొన్నింటిని బలోపేతం చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ /సమగ్రశిక్ష నిర్ణయించింది. ఈ నేపథ్యంలో లైబ్రరీలు, రీడింగ్‌ గదులు అభివృద్ధి కోసం గ్రంథాలయ సంస్థలు,/ ప్రజాగ్రంథాలయాల ద్వారా నిధులు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ అనుమతినిచ్చారు.

ప్రతీనెల రూ.1,000 ఆర్థిక సాయం..

పత్రికలు, మ్యాగజైన్లు, జర్నళ్ల కొనుగోలు కోసం ఎంపిక చేసిన ఒక్కో హైస్కూల్‌కు ప్రతీనెల రూ. 1000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. సంబంధిత హైస్కూల్‌ హెచ్‌ఎం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థి మండలి సభ్యులు కొనుగోలు చేయాల్సినవి నిర్ణయించుకోవాల్సింటుంది.

లైబ్రరీల బలోపేతానికి రూ. 15వేలు

ఎంపిక చేసిన హైస్కూల్‌లోని లైబ్రరీ బలోపేతానికి రూ 15,000 చొప్పున విడుదల చేయబోతున్నారు. ఈ నిధులతో లైబ్రరీ గది మరమ్మతులు, పెయింటింగ్‌, టేబుల్స్‌, కుర్చీలు, బుక్‌ ర్యాక్‌లు, ఆల్మారాలు, ఫ్యాన్లు కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు సమకూర్చడం కోసం వినియోగించుకోవాల్సింటుంది.

ప్రతీ లైబ్రరీలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలి

ప్రతీ లైబ్రరీలో ‘దిస్‌ లైబ్రరీ డెవలప్‌డ్‌ అండ్‌ మెయిన్‌టెయిన్డ్‌ విత్‌ ఫండింగ్‌ ఫ్రమ్‌ జిల్లా గ్రంథాలయాల సంస్థ’ అనే వాక్యంతో బోర్డును కూడా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఉమ్మడివరంగల్‌ జిల్లాలో 44 ప్రభుత్వ, జిల్లాపరిషత్‌ హైస్కూళ్లను ఎంపిక చేశారు.

జిల్లాల వారీగా ఎంపిక చేసిన హైస్కూళ్లు..

హనుమకొండ జిల్లాలో 15 హైస్కూళ్లు ఉన్నాయి. అందులో హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌, జులైవాడ ప్రభుత్వ హైస్కూల్‌, సుబేదారి ప్రభుత్వ హైస్కూల్‌, లష్కర్‌బజార్‌ జీహెచ్‌ఎస్‌ గర్ల్స్‌ హైస్కూల్‌, వడ్డేపల్లి జీహెచ్‌ఎస్‌, నారాయణగిరి జీహెచ్‌ఎస్‌, కాజీపేట జీహెచ్‌ఎస్‌, శాయంపేట జీహెచ్‌ఎస్‌, హనమకొండ జీహెచ్‌ఎస్‌, కాజీపేట జాగీర్‌ జీహెచ్‌ఎస్‌, పెద్దపెండ్యాల జెడ్పీహెచ్‌ఎస్‌, వేలేరు జెడ్పీహెచ్‌ఎస్‌, వంగపహాడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, కడిపికొండ జెడ్పీహెచ్‌ఎస్‌, తరాలపెల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నాయి.

వరంగల్‌ జిల్లాలో పది ..

కరీమాబాద్‌ జీహెచ్‌ఎస్‌, కృష్ణకాలనీ జీహెచ్‌ఎస్‌, రంగశాయిపేట జీహెచ్‌ఎస్‌ గర్ల్స్‌, దేశాయిపేట జీహెచ్‌ఎస్‌, ధర్మారం జెడ్పీహెచ్‌ఎస్‌, పర్వతగిరి జెడ్పీహెచ్‌ఎస్‌, శంభునిపేట జీహెచ్‌ఎస్‌, క్రిస్టియన్‌కాలనీ జీహెచ్‌ఎస్‌, శివనగర్‌ జీహెచ్‌ఎస్‌, మట్టెవాడ జీహెచ్‌ఎస్‌ ఉన్నాయి.,

మహబూబాబాద్‌ జిల్లాలో పది..

మహబూబాబాద్‌ జీహెచ్‌ఎస్‌, మహబూబాబాద్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, పెద్దవంగర జెడ్పీహెచ్‌ఎస్‌, చిన్నగూడూరు జెడ్పీహెచ్‌ఎస్‌, మోదుల గూడెం జెడ్పీహెచ్‌ఎస్‌, ఈదుల పూసపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌, మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌, ముల్కలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌, కల్వల జెడ్పీహెచ్‌ఎస్‌, రాజోలు జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నాయి.

జనగామ జిల్లాలో ఆరు..

జనగామ జీహెచ్‌ఎస్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, పెంబర్తి జెడ్పీహెచ్‌ఎస్‌, శివునిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌, పాలకుర్తి మండలం చెన్నూరు జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నాయి.

ములుగు జిల్లాలో రెండు..

ములుగు మండలం వెంకటాపురం జెడ్పీహెచ్‌ఎస్‌, మంగపేట జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నాయి .

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఒకటి

జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ (గర్ల్స్‌) ఉన్నాయి.

ప్రత్యేకంగా నిధుల కేటాయింపు

ఉమ్మడి జిల్లాలో44 ఉన్నత పాఠశాలల ఎంపిక

Advertisement
 
Advertisement
Advertisement