హన్మకొండ: ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో డిప్యూటీ రీజినల్ మేనేజర్‌తోపాటు పలువురు డిపో మేనేజర్లు బదిలీ అయ్యారు. వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) గా పని చేస్తున్న పి.మహేశ్‌ను సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ ఆర్‌ఎం (ఆపరేషన్స్) గా బదిలీ చేస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్ పరిధిలోని భూపాలపల్లి డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమంచ ఇందు ఏటీఎంగా బస్ భవన్‌కు, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణను భూపాలపల్లి డీఎంగా నియమించారు. జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతిని చెంగిచెర్ల డిపోకు, షాద్‌నగర్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఎం.ఉషను జనగామ డిపో మేనేజర్‌గా నియమించారు. నర్సంపేట డిపో మేనేజర్ కె.ప్రసూనలక్ష్మిని తొర్రూరు డిపో మేనేజర్‌గా, మెట్‌పల్లి డిపో మేనేజర్ ఎం.సరస్వతిని నర్సంపేట డిపో మేనేజర్‌గా నియమించారు. తొర్రూరు డిపో మేనేజర్ వి.పద్మావతిని హైదరాబాద్ తార్నాక హాస్పిటల్ పీఓగా బదిలీ చేశారు. పరకాల డిపో మేనేజర్ జి.రాంప్రసాద్‌ను మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్‌గా, మంచిర్యాల డిపో మేనేజర్ టి.శ్రీనివాసులును పరకాల డిపో మేనేజర్‌గా నియమించారు. వరంగల్ బస్‌స్టేషన్ ఏటీఎంగా పనిచేస్తున్న మల్లేశయ్యను కొల్లాపూర్ డిపో మేనేజర్‌గా బదిలీ చేశారు.
ఆడుకుంటూ వెళ్లి
అనంతలోకాలకు..
● సంపులో పడి బాలుడి మృతి
● నర్మెటలో ఘటన
నర్మెట: ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు చేరాడు. నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జనగామ జిల్లా నర్మెటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రొయ్యల సరిత, వెంకటేష్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రుత్విక్ (4) ఉన్నారు. ఈ క్రమంలో ఆ బాలుడు సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలోని నీటి తొట్టి (సంపు) పడిపోయాడు. శబ్దం విన్న కుటుంబీకులు బాలుడిని తొట్టి నుంచి తీసి 108లో జనగామ మాతా శిశు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.


