హన్మకొండ: చేనేత వస్త్రాల కొనుగోలులో ఓపెన్ టెండర్ విధానం, ఓపెన్ మార్కెట్ విధానం రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు కోరారు. జీఓ 1తో చేనేత సహకార సంఘాల నుంచి ఆర్డర్ల ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకులాలు, సొసైటీల కోసం చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. చేనేత కార్మికులు, పవర్ లూం కార్మికులను ఆదుకోవడానికి 2024లో ప్రభుత్వం జీఓ 1ని జారీచేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా కాకుండా ఓపెన్ టెండర్ విధానంలో కొనాలని భావించడంతో దాదాపు 50 వేల మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాల కొనుగోలు విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాని విజ్ఞప్తి చేశారు.
ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు


