భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డికి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డికి పురస్కారం

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

విద్యారణ్యపురి: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని పీఎల్‌ఆర్‌ గార్డెన్‌లో సహృదయానుబంధ పురస్కా ర ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో తెలంగాణ భాషా సాంస్కృతికశా ఖ డైరెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డికి ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సంస్థ బాధ్యులు మల్యాల మనోహరరావు స్వాగతంతో గిరిజామనోహరాబా బు అధ్యక్షతన జరిగిన సభకు జస్టిస్‌ లింగాల నర్సింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడు తూ రాళ్లబండి కవితాప్రసాద్‌ తెలుగు సాహిత్యానికి అవధాన రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా కవితాప్రసాద్‌ కావ్యగ్రామం గ్రంథాన్ని ఆవిష్కరించారు. టి. లక్ష్మణ్‌ రావు కవితాప్రసాద్‌ పద్యాలు పఠించారు. అనంతరం సహృదయ సంస్థ ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎన్‌చారి సన్మాన పత్రం పఠించి నర్సింహారెడ్డికి ప్రదా నం చేశారు. ఈసభకు కవితాప్రసాద్‌ సతీమణి నాగి నీదేవి, కుమారుడు సంవరణ్‌, బాధ్యులు ఎన్‌. భా స్కర్‌రావు,నాగిళ్లరామశాస్త్రి, మారుపాక రాధాకృష్ణ రాజేశ్వర్‌రావు,అనిల్‌ప్రసాద్‌, శ్రీనివాస్‌,మండువ రవీందర్‌రావు,మడత భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement