కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు శుక్రవారం ఆలయ ముఖ మండపంలో దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిశీలకుడు సంజీవరెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా.. ముగ్గురు హాజరు కాలేదు. వీరు ఆలయ చైర్మన్‌గా కొర్ను రవీందర్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. ఆలయ పాలక మండలి చైర్మన్‌తోపాటు సభ్యులను ఈఓ సత్యనారాయణను సత్కరించి వీరభద్రస్వామి చిత్రపటాలను బహూకరించారు. ఈసందర్భంగా చైర్మన్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సహకారంతో ఆలయాన్ని రూ.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, కుదురుపాక ఉప్పలయ్య, బందెల సంజీవరెడ్డి, దొంగల జనార్దన్‌రెడ్డి, గడీల భిక్షపతి, చిన్నం గణేశ్, ప్రొద్దుటూరి సత్యనారాయణ, భూక్య సక్రునాయక్, గుగులోత్ సోమ్లా, వెంపటి శ్రీను పాల్గొన్నారు. కాగా, వీరిని కాంగ్రెస్ నాయకులు అంబటి వీరభద్రంగౌడ్, బండి శ్రీనివాస్, నూకల వేణుగోపాల్‌రెడ్డి, బాదావత్ రామునాయక్, వద్దుల సురేందర్‌రెడ్డి, గొల్లపల్లి రజనీకాంత్, బానోత్ తుకారంనాయక్, డాక్టర్ వీరన్న, శ్యామల వేణు, దైద భద్రయ్య, దయ్యాల శ్రీధర్ పాల్గొన్నారు.


