మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో సీఐడీ బృందం శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఆశాఖలో కీలక రికార్డులు, ఫైళ్లు పరిశీలించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలతోపాటు మానుకోట జిల్లా మైనింగ్ శాఖలో కూడా సీఐడీ బృందం తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మానుకోట జిల్లాలో 45 క్వారీలు ఉండగా.. అందులో 6 క్వారీలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు మేరకు సీఐడీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. క్వారీల లీజులు, రాయల్టీ చెల్లింపులు, అనుమతుల్లేని క్వారీలు ఇలా.. పలు కోణాల్లో విచారణ జరిపారు. ఇనుగుర్తి, గూడూరు, కేసముద్రం, అదే మండలంలోని అర్పనపల్లిలో ఉన్న క్వారీలను సీఐడీ బృందం తనిఖీలు నిర్వహించింది. అదేవిధంగా.. కార్యాలయంలో కీలక అధికారులు ఫైళ్లను, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని అధికారులు సేకరించారు.
ఉదయం నుంచి సోదాలు
పలు క్వారీల్లో తనిఖీ


