● జిల్లా ఇన్‌చార్జ్ జడ్జి ఎంఆర్.సునీత
మహబూబాబాద్ రూరల్: రేపటి తరం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ జడ్జి ఎంఆర్.సునీత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి సునీత హాజరై మొక్కనాటారు. ఈసందర్భంగా ఒక వినూత్న, పర్యావరణహిత బోర్డును న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ‘ఇక్కడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇవ్వబడవు. వినియోగదారులు/కొనుగోలుదారులు తమ సొంత చేతి బ్యాగులను వెంట తెచ్చుకోవాలి’ అనే సందేశంతో కూడిన బోర్డును ఆవిష్కరించారు. దీన్ని స్థానిక వీధి వ్యాపారులు అందరూ తమ దుకాణాల వద్ద ప్రదర్శించేలా చర్యలు ప్రారంభించారు. పర్యావరణ చైతన్యాన్ని సమాజంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పారా లీగల్ వలంటీర్లు, ఎన్‌సీసీ కేడెట్లకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ్, బార్ ప్రెసిడెంట్ మామిడాల సత్యనారాయణ, కార్యదర్శి జంగం సిద్ధార్థ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.నాగేశ్వరావు, వి.రాజ్ కృష్ణ, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి ఎస్సెస్పీ శ్రీనివాస్, సూపరింటెండెంట్ పూస శ్రీనివాస్, కోర్టు సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది గౌస్ పాషా, నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 11వ బెటాలియన్ ఎన్‌సీసీ కేడెట్లు తదితరులు పాల్గొన్నారు.


