● పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా సీపీఐ మారనుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా, రైతాంగ, విద్యార్థి, మహిళాళ, ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ అధిక ధరల పెంపుపై ఈ నెల 10న జిల్లా కేంద్రాల్లో భారీ ఆందోళనలు, ఆగస్టు 6వ తేదీ నుంచి 14 వరకు రాష్ట్రంలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారధి, సహాయ కార్యదర్శులు బి.అజయ్‌సారధిరెడ్డి, నల్లు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, ఖమ్మం జిల్లా కార్యదర్శి జితేందర్‌రెడ్డి, రేషపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన సీపీఎం నాయకులు..
జిల్లాలోని గార్ల మండలానికి చెందిన సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సమక్షంలో సీపీఐలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో భూక్య హరినాయక్, మెదరమెట్ల గిరిప్రసాద్, అన్నం శ్రీనివాస్, పూల్‌సింగ్, దారావత్ లక్ష్మీ, భూక్య పద్మ, మంగీలాల్, శ్రీను, సోమ్లానాయక్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, వరిపెల్లి వెంకన్న, జంపాల శ్రీనివాస్, నర్ర శ్రావణ్, మాగం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.


