సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

మంత్రి సీతక్క

గంగారం: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి అసనూయ సీతక్క అన్నారు. గంగారం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. తొలుత ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గంగారం మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాదర్బార్‌ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మహబూబాద్‌ కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మంత్రి సీతక్క అన్నారు. గంగారం మండలంలో ప్రజాదర్బార్‌లో భాగంగా మంత్రి సీతక్క, మహబూబాబాద్‌ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆధ్వర్యంలో పలువురు తల్లిదండ్రులకు అడ్మిషన్‌ ఫారాలను అందించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ రమాదేవి, ఏఎస్‌సీ సంతోశ్‌ ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గంగారం మండలంలోని పుల్సంవారిగుంపు, మర్రిగూడెం, గ్రామాల్లో నిర్వహించి బడిబాట కార్యక్రమానికి డీఈఓ సత్యనారాయమూర్తి హాజరై అవగాహన కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement