గంజాయి రహిత జిల్లా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గంజాయి రహిత జిల్లా లక్ష్యం

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

ఎస్పీ శబరీష్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : మానుకోటను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ గంజాయి నియంత్రణపై మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా పెడుతున్నాయని తెలిపారు. గంజాయి సేవి ంచే వారిని గుర్తించేందుకు అత్యాధునిక 4వేల గంజాయి టెస్టింగ్‌ కిట్లు వచ్చాయన్నారు. ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఈ కిట్లను విధుల్లో భాగంగా వెంట తీసుకెళ్లి అనుమానిత వ్యక్తులను, పదార్థాలను అక్కడికక్కడే పరీక్షించి 10 నిమిషాల్లో ఫలితాలు పొందవచ్చని చెప్పారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో డీ అడిక్షన్‌ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయం, విని యోగం, రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 87126 56999 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్‌, సీఐలు రఘుపతిరెడ్డి, అంజలి, పవన్‌ కుమార్‌, రవీందర్‌, గణేష్‌, చంద్రమౌళి, సత్యనారాయణ, వినయ్‌ కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement