● మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి
మహబూబాబాద్: వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మానుకోట మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యోతి అన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలో 7,8,19,20వ వార్డులకు సంబంధించి వార్డు సభ నిర్వహించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, వాటి వల్ల దోమల సంఖ్య పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరారు. ప్రజల సహకారంతోనే సమస్యలు పరిష్కారం కావడంతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, కమిషనర్ వినోద్‌కుమార్, కౌన్సిలర్లు బుజ్జి, నీరుటి హైమా, బానోత్ పార్వతి, చిదిరాల అరుణ, తదితరులు పాల్గొన్నారు.


