సన్నాలు సాగు చేయండి | - | Sakshi
Sakshi News home page

సన్నాలు సాగు చేయండి

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

సన్నాలు సాగు చేయండి

హసన్‌పర్తి: అధిక దిగుబడి, మంచి మార్కెట్‌ ధర పొందేందుకు సన్నరకాలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి విజయ్‌చంద్ర సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం అన్నాసాగరం, సీతంపేటలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్‌చంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతులకు సూచనలిచ్చారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మేక రమ్య, రామంచ వెన్నెల, ఉపసర్పంచ్‌ బండారు సాగర్‌, ఏఓ అనురాధ, హెచ్‌ఓ సుష్మిత, ఏఈఓ ప్రవళిక, సాయి, పంచాయతీ కార్యదర్శులు అనూష, సరితతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement