ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం పీఎస్ పరిధిలో రూ.6.25 లక్షల విలువైన 526 గ్రాముల హశిష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ అనుమలు శ్రీనివాస్, ఎస్సై మహేశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం సర్కిల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై మహేశ్ సిబ్బందితో కలిసి మండల కేంద్రం సమీపంలోని జీడివాగు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నల్లగట్ల సురేంద్ర కుమార్, బండ్ల సాయి బైక్ వస్తూ అనుమానాస్పందగా కనిపించారు. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగు తనిఖీ చేయగా హశిష్ ఆయిల్ లభించింది. సురేంద్ర కుమార్, సాయి ఒడిశాలోని కుమురమానూరు చెందిన రాజు నాయక్ వద్ద నుంచి హశిష్ ఆయిల్ కొనుగోలు చేశారు. అనంతరం బైక్‌పై ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సిరోంచ వైపునకు ఏటూరునాగారం మీదుగా వెళ్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రెండు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారని సీఐ తెలిపారు. కాగా, ములుగు జిల్లాలో ఇలాంటి ఆయిల్ లభించడం ఇదే మొదటి సారి అన్నారు. సిబ్బంది హరీశ్, చంద్రమోహన్, సదానందం, సుధాకర్, మహేందర్ పాల్గొన్నారు.
ఇద్దరు నిందితులు అరెస్ట్
వివరాలు వెల్లడించిన పోలీసులు


