నత్తనడకన బడిబాట | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన బడిబాట

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

బడిబాట ద్వారా

విద్యార్థుల ప్రవేశాల వివరాలు

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఏటా జూన్‌ 6 నుంచి 19వ తేదీ వరకు 15 రోజులపాటు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బడీడు, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. అయితే ఆశించిన మేరకు ప్రవేశాలు పెరగడం లేదు. దీంతో ఈ విద్యా సంవత్సరం కార్యక్రమాన్ని మే 14న ప్రారంభించి జూన్‌ 19వ తేదీ వరకు 36 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది కంటే కనీసం 10శాతం ప్రవేశాలు పెంచాలని ఉపాధ్యాయులకు టార్గెట్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లావ్యాప్తంగా జనగణన సాగుతోంది. ఉపాధ్యాయులు ఇప్పటికే ఆ విధుల్లో ఉన్నారు. ఓవైపు జనగణన.. మరోవైపు బడిబాట రెండు విధులు ఒకేసారి చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో బడిబాట పూర్తిస్థాయిలో కొనసాగేనా అని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు.

జనగణనతోనే సరి..

బడిబాట లక్ష్యం చేరడానికి జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో 3,491మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 1,854 మంది జనగణన సర్వే విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, బడిబాటలో ఎలా పాల్గొంటామని వారు వాపోతున్నారు. జనగణన విధుల్లో పాల్గొంటే అదనంగా 24ఆర్జిత సెలవులు ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో మెజార్టీ ఉపాధ్యాయులు ఈ విధులు నిర్వహించేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రధానోపాధ్యాయులతో పాటు సీనియర్‌ ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండగా మిగిలిన ఉపాధ్యాయులంతా జనగణన విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బడిబాట మొక్కుబడేనా అనే చర్చ జరుగుతోంది.

బడిబాట ఇలా..

జూన్‌ 3న గ్రామసభ, 4న అవగాహన ర్యాలీ, 5న సీఎస్‌ఈబ్ల్యూఎన్‌ పిల్లల గుర్తింపు, 6న బడిబయట పిల్లల గుర్తింపు, 8నుంచి 10వరకు ఇంటింటా ప్రచారం, 12న వెల్కమ్‌ డే, 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్‌ఎల్‌ఎల్‌ డే, 17న గర్ల్స్‌ చిల్డ్రన్స్‌ డే, 18న డిజిటల్‌ అవేర్‌నెస్‌ డే, 19 స్పోర్ట్స్‌ డే నిర్వహించాలని సూచించారు. గత విద్యా సంవత్సరంతో పోల్చితే కనీసం 10శాతం నమోదు సాధించాలని టీచర్లకు లక్ష్యం విధించారు.

అడ్మిషన్లు పెంచుతాం

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, భోజనం అందిస్తున్నాం. ఉత్తమ ఫలితాలతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. దీనిని ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం లక్ష్యంగా ముందుకు వెళ్తాం. ఉపాధ్యాయులు జనగణన విధులతో పాటు బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బడిబాటను విజయవంతం చేయడానికి ఉపాధ్యాయుల కృషి చేయాలి.

– సత్యనారాయణమూర్తి, డీఈఓ

7,921

విద్యా సంవత్సరం

4,097

ఇప్పటివరకు

ప్రవేశాలు

2025–26

2026–27

2024–25

జనగణన విధుల్లో ఉపాధ్యాయులు

ఇప్పటివరకు 1,684 మంది విద్యార్థుల ప్రవేశాలు

లక్ష్యానికి దూరంగా కార్యక్రమం

Advertisement
 
Advertisement
Advertisement