వీరన్న సన్నిధిలో పూజలు | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధిలో పూజలు

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని డైరెక్టర్‌ ప్రొటోకాల్‌ జీఏడీ శివలింగయ్య(ఐఏఎస్‌) దంపతులు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి స్వాగతం పలికారు. వారు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. వారి పేర అర్చకులు గోత్రనామార్చనలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ, సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మీరాజునాయక్‌, పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌, జీపీఓ జుంకీలాల్‌, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.శ్రీనివాస్‌ ఉన్నారు.

గర్భిణులకు అవగాహన కల్పించాలి

దంతాలపల్లి: గర్భిణులకు ఎండ తీవ్రతపై వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని గర్భిణులు, ప్రజలకు తగిన వైద్యం చేయాలన్నారు. ఎండదెబ్బతో వచ్చినవారికి వెంటనే పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో సుఖ ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భం దాల్చిన వారి పేర్లు వెంటనే నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారి కవిత, సిబ్బంది పాల్గొన్నారు.

పథకాల అమలులో అగ్రస్థానంలో నిలపాలి

మహబూబాబాద్‌ రూరల్‌: పథకాల అమలులో రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని డీఏఓ ఎస్‌.విజయచంద్ర అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలపై మహబూబాబాద్‌ పట్టణంలోని రైతు వేదికలో వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, ఏఈఓలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. పథకాల అమలులో ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు అందుబాటులో ఉంటూ నకిలీ విత్తనాల మీద రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న రైతు బీమా, రైతుబంధు, ఫార్మర్‌ రిజిస్ట్రీ, పీఎం కిసాన్‌, క్వాలిటీ కంట్రోల్‌, వరి కొయ్యలను కాల్చడంపై కలిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు, ఆయిల్‌ పామ్‌ పంట వల్ల రైతులకు కలిగే లాభాలు, పచ్చిరొట్ట ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలు, ఖేతీ బచావో ఉపయోగాలను రైతులకు తెలియజేయాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, నానో యూరి యా వాడకాన్ని పెంచడం, పురుగుమందుల వాడకాలు తగ్గించాలని రైతులకు వివరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, డివిజన్‌ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, మరిపెడ ఇన్‌చార్జ్‌ ఏడీఏ శ్రీదేవి, డీఏఓ కార్యాలయ టెక్నికల్‌ ఏడీఏ మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement