మహబూబాబాద్: విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు, సంబంధిత అధికారులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, బోధన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాల్లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నారు. విద్యార్థులు చదవడం, రాయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, డీఈఓ సత్యనారాయణ మూర్తి, డీఐఈఓ మదార్ తదితరులు పాల్గొన్నారు.
వీసీలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా


