నేను గీసిన బొమ్మ | - | Sakshi
Sakshi News home page

నేను గీసిన బొమ్మ

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

పట్టుకుంటే ఔట్‌..

ఒకప్పుడు నలుగురు బాలబాలికలు కలిస్తే చాలు కుంటుడు ఆట ఆడేవారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆటను పూర్తిగా మరిచిపోయారు. కానీ ప్రస్తుత కాలంలో కొందరు గ్రామీణ, పట్టణ ప్రాంత వాసులు తమ పిల్లలకు నాటి ఆటలు నేర్పిస్తుండడం విశేషం. ఒక కాలును పైకి లేపి ప ట్టుకుని మరో కాలుతో కుంటుతూ మిగతా పిల్ల లను పట్టుకోవడాన్ని ఔట్‌గా పిలుస్తారు. కుంటుకుంటూ వచ్చే వ్యక్తిని తప్పించుకోవడం ఈ ఆటలో ప్రధానం.

–కాజీపేట

హైదరాబాద్‌ అద్భుతంగా ఉంది

మండలంలోని పాతదుబ్బతండాకు చెందిన భార్గవి, పూజ, రేవంత్‌ డోర్నకల్‌ సెయింట్‌ ఆగ్నేస్‌ పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లోని చార్మినార్‌, గోల్కొండ కోట, ట్యాంక్‌బండ్‌, లుంబినీ పార్క్‌, అంబేడ్కర్‌ విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.

–డోర్నకల్‌

Advertisement
 
Advertisement
Advertisement