చిట్యాల/గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్‌కు చెందిన రైతు మాశబో యిన రాజయ్య (65) బుధవారం ఉదయం చల్లగరిగ శివారులో మొక్కజొన్న సొప్ప కాల్చేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతతో తీవ్ర అస్వస్థతకు గురై పక్కనే ఉన్న చెట్టుకింద స్పృహతప్పి పడ్డాడు. గమనించిన సమీప రైతులు కుటుంబీకులకు సభ్యులకు సమాచారం అందించగా వారు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, రాజయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అలాగే, గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన గాదె అంజయ్య(45) గ్రామాల్లో తిరుగుతూ పండ్ల వ్యాపారం చేస్తాడు. ఈ క్రమంలో బుధవారం పలు గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేసి సాయంత్రం ఇంటి వద్దకు వచ్చి అస్వస్థతకు గురై మృతి చెందాడు.


