తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంసీఏ చదువుతున్న బానోత్ బాలాజీ నాయక్ తెలంగాణ రాష్ట్రం రాదేమోనని మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన బలిదా నంతో మానుకోట ప్రాంతంలో ఉద్య మం మరింత ఉధృతమైంది. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రూ.10 లక్షల నగదుతో పాటు ఆయన కుటుంబంలో ఉద్యోగం ఇచ్చారు. మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని బాలాజీ నాయక్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా బాలాజీ నాయక్ అన్నావదిన బానోత్ మాలు–బుజ్జి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఉద్యమకారుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


