నేడు కలెక్టరేట్‌లో ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ఆవిర్భావ వేడుకలు

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌

రాంచంద్రునాయక్‌

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం వేడుకలకు ముఖ్య అతిథిగా డోర్నకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఉయదం 7.30గంటలకు నివాళులర్పిస్తారు. 7.50గంటలకు కలెక్టరేట్‌లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 7.55గంటలకు అతిథులకు స్వాగతం, 8గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ, 8.05గంటలకు తెలంగాణ గానం, 8.10గంటలకు ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 8.30నుంచి 9గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

మరిపెడ మున్సిపల్‌

కమిషనర్‌గా నరేష్‌రెడ్డి

మరిపెడ: మరిపెడ మున్సిపల్‌ కమిషనర్‌గా కంచర్ల నరేష్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన విజయానంద్‌ బదిలీ కాగా.. ఆయన స్థానంలో భువనగిరి మున్సిపల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించిన నరేష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ కాలం సునీత, కౌన్సిలర్లు గంట్ల గౌతమ్‌రెడ్డి, నీల, రాములు, రాము పాల్గొన్నారు.

మానుకోట కమిషనర్‌గా..

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపల్‌ కమిషనర్‌గా ఎం.వినోద్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మానుకోట కమిషనర్‌గా పని చేసిన రాజేశ్వర్‌ హనుమకొండ మెప్మా పీడీగా బదిలీ అయ్యారు.

ఎఫ్‌ఆర్‌ఓగా సురేష్‌

మహబూబాబాద్‌ రూరల్‌: అటవీశాఖ రేంజ్‌ అధికారిగా బి.సురేష్‌ సోమవారం విధుల్లో చేరారు. ఇక్కడ పనిచేసిన ఎఫ్‌ఆర్‌ఓ జోత్స్నాదేవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల రేంజ్‌కు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో గూడూరు నుంచి సురేష్‌ బదిలీపై వచ్చారు.

జిల్లా సహకార అధికారిగా విజయకుమారి

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లా సహకార శాఖ అధికారిగా ఎ.విజయకుమారి విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డీసీఓ ఎన్‌.వెంకటేశ్వర్లు వరంగల్‌ డీసీసీబీ స్పెషల్‌ కేడర్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ (ఓఎస్‌డీ)గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వరంగల్‌ డీసీసీబీ డిప్యూటీ రిజిస్ట్రార్‌ (ఓఎస్‌డీ)గా పనిచేస్తున్న ఎ.విజయకుమారి డిప్యూటీ రిజిస్ట్రార్‌ / ఆడిట్‌ ఆఫీసర్‌ హోదాలో పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా సహకార శాఖ అధికారిగా వస్తున్నారు.

ముగిసిన బాస్కెట్‌బాల్‌ పోటీలు

గార్ల: గార్ల బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన 3జిల్లాల స్థాయి అండర్‌–17 బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో గెలుపొందిన విజేతలకు సోమవారం బహుమతులను సర్పంచ్‌ బానోత్‌ పార్వతిహతీరాం, ఎస్సై సాయికుమార్‌ చేతుల మీదుగా అందజేశారు. మహబూబాబాద్‌ బాలురు, బాలికల జట్లు ప్రథమస్థానంలో నిలిచాయి. పాల్వంచ బాలుర టీం ద్వితీయస్థానం, అశ్వాపురం బాలుర జట్టు తృతీయస్థానంలో నిలిచింది. గార్ల బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు అసోసియేషన్‌ సెక్రటరీ సూత్రపు జయశంకర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గార్ల ఉపసర్పంచ్‌ జరీనాబేగం, పాఠశాల హెచ్‌ఎం శీలంశెట్టి వెంకటేశ్వర్లు, వార్డుసభ్యుడు తోడేటి శ్రీనుగౌడ్‌, రెఫరీలుగా మోహన్‌, సాయి, చక్రీ, పవన్‌, అనిల్‌ మేఘన్‌ వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement