పలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ డిజిటల్ కరపత్రాలతో బోగస్ ప్రచారాలు చేస్తున్నారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇంటర్ బోర్డు అధికారులపై ఉంది. తాయిళాలు ప్రకటిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ కళాశాలల అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలి. అక్రమ ముందస్తు అడ్మిషన్ల దందాపై భవిష్యత్ కార్యచరణ రూపొందించి ముందుకు సాగుతాం.
–అమీర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోంది. నిపుణులైన అధ్యాపకులతో బోధన సాగుతోంది. అనుమతి లేని ప్రైవేటు కళాశాలల్లో చేరి ఇబ్బందులు పడవద్దు. అనుమతి, గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే చేరాలి. ఎవరైనా ప్రవేశాల కోసం ఇబ్బందులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటాం.
–మదార్‌గౌడ్, డీఐఈఓ, మహబూబాబాద్


