బడి బస్సు భద్రమేనా? | - | Sakshi
Sakshi News home page

బడి బస్సు భద్రమేనా?

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డెక్కితే సీజ్‌

వాహనాలు తీసుకురావాలని యాజమాన్యాలకు ఆర్టీఏ అధికారుల నోటీసులు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు

ఖిలా వరంగల్‌: పాఠశాలల పునఃప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈక్రమంలో బడి బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. బస్సుల ఫిట్‌నెస్‌ గడువు మే 15తోనే ముగిసింది. బస్సులను మరమ్మతులు చేసి ఫిట్‌నెస్‌ పరీక్షలకు తీసుకురావాలని ఆర్టీఏ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌సీ) గడువు ముగిశాక బస్సులు రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు ఉన్నాయి.

ఫిట్‌నెస్‌ నిబంధనలు ఇలా..

బస్సుకు పవర్‌ స్టీరింగ్‌ ఉండాలి. డ్యాష్‌ ప్యానల్‌ బోర్డులో ఎడమ, కుడి ఇండికేటర్స్‌ తప్పనిసరి. బ్రేకుల్లో లోపం తెలిపే ఎరుపు ఇండికేటర్‌ ఉండాలి. ఫ్యూయల్‌ గేజ్‌, స్పీడో మీటర్‌, డ్రైవర్‌ సీట్‌ దగ్గర ఎయిర్‌ హైండ్‌ బ్రేక్‌ ఉండాలి. గేర్‌ లీవర్‌లో అంతర్గ త స్ప్రింగ్‌ బాగుండాలి. వెనకదారి కనిపించేలా అద్ద ం తప్పనిసరిగా ఉండాలి. బస్సులో విద్యార్థుల కదలకలు కనిపించేలా ఇంటర్నల్‌ అద్దం, విద్యార్థులు ఎక్కుడం, దిగడం స్పష్టంగా కనిపించేలా కన్వీక్స్‌క్రాస్‌ వ్యూ అద్దాలు అమర్చాలి. ఫుట్‌బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు మించి ఉండరాదు. ఫార్మింగ్‌ లైట్లు, అత్యవసర ద్వారం విధిగా ఏర్పాటు చేయాలి. బస్‌ డ్రైవర్‌కు 60 ఏళ్లు పైబడి ఉండొద్దు. బస్సులో డ్రైవర్‌ లైసెన్స్‌, బస్‌నంబర్‌, ఇంజన్‌ నంబర్‌, చాసిస్‌ నంబర్‌ కలిగిన కాగితం పటం కట్టించి డ్రైవర్‌ కుడివైపు పెట్టాలి. స్కూల్‌ కరస్పాండెంట్‌ ఫోన్‌ నంబర్‌ ఉండాలి.

బస్సు కండీషన్‌ పరిశీలించాలి..

స్కూల్‌ బస్సు కండీషన్‌ పరిశీలిస్తుండాలి. యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే ఆర్టీఏ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. డ్రైవర్‌ తీరును గమనిస్తుండాలి. మద్యం సేవించినట్లు గుర్తిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి.

బ్రేక్‌ నిబంధనలు ఇవే..

బస్‌ బ్రేక్‌ చేసేందుకు 32 నిబంధనలు పరిశీలిస్తారు. బస్సు పసుపు రంగులో ఉండాలి. డ్రైవర్‌కు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. పిల్లల జాబితా, ఎక్కడ ఎక్కుతున్నారో వివరాలు ఉండాలి. బ్రేక్‌ ఇంజన్‌, టైర్లు, లైటింగ్‌ సిస్టం మొత్తం పరిశీలించి ఆర్టీఏ అధికారులు ధ్రువపత్రం జారీ చేస్తారు.

ఎంవీఐ రూల్స్‌..

ఎంవీఐ రూల్‌ 185 (జీ) ప్రకారం పాఠశాల యాజమాన్యాలు 32 నిబంధనలు పాటించాలి. నెట్‌లో స్కూల్‌ పూర్తి వివరాలు, స్కూల్‌ అడ్రస్‌, స్కూల్‌ బస్‌ నంబర్‌, డ్రైవర్‌ వివరాలు, లైసెన్స్‌, బ్యాడ్జీ నంబర్‌, బీమా, ట్యాక్స్‌ ఫోన్‌ నంబర్లు పొందుపరచాలి. డ్రైవర్‌, అటెండర్‌ ఫొటోలను నెట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం ప్రభుత్వ ధ్రువపత్రాన్ని రవాణా అధికారులకు అందించి తగిన రుసుం తెల్లించాలి. పరీక్షల అనంతరం ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ జారీ అవుతుంది.

ఎఫ్‌సీ లేకుంటే సీజ్‌చేస్తాం

సెలువుల్లోనే స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ చేసుకోవాలి. ఎఫ్‌సీ (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) గడువు ముగిసిన బస్సులు రోడ్లపై కనిపిస్తే సీజ్‌చేస్తాం. తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసుకొని సర్టిఫికెట్‌ తీసుకోవాలి. నిబంధనలు పాటిస్తేనే ఎంవీఐలు ఎఫ్‌సీ జారీ చేస్తారు. విద్యాసంస్థల యజమాన్యాలు సహకరించాలి.

– సురేశ్‌రెడ్డి, డీటీసీ, వరంగల్‌

జిల్లా బస్సులు ఫిట్‌నెస్‌ కానివి

అయినవి

వరంగల్‌ 444 225 219

హనుమకొండ 957 650 307

జనగామ 198 102 96

మహబూబాబాద్‌ 197 139 58

ములుగు 116 17 99

భూపాలపల్లి 162 121 41

మొత్తం బస్సులు 2,074 1,254 820

Advertisement
 
Advertisement
Advertisement